చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో బాలయ్య

Balayya Attend Akhanda Movie 175 Days Celebrations. చిలకలూరి పేటలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.

By Medi Samrat  Published on  29 May 2022 7:30 PM IST
చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో బాలయ్య

చిలకలూరి పేటలో నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయనతో పాటూ దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అక్కడికి వచ్చారు. అఖండ రిలీజ్ అయి 175 రోజులు సింగిల్ థియేటర్ లో ఆడటంతో రామకృష్ణ థియేటర్ యాజమాన్యం మే 29 ఆదివారం ఉదయం సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రామ‌కృష్ణ థియేట‌ర్ కి బాల‌కృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి హాజరయ్యారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేసి, పలువురికి జ్ఞాపికలు అందించారు

బాలకృష్ణ, బోయపాటి మాస్ కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' భారీ విజయం సాధించింది. కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత అఖండ సినిమా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది. అది కూడా తక్కువ ధరకే సినిమా టికెట్లను అమ్మారు. అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటికే 50 రోజుల వేడుక, 100 రోజుల వేడుకని సెలబ్రేట్ చేసుకొని తాజాగా 175 రోజుల వేడుక సెలబ్రేట్ చేసుకుంది. ఏది ఏమైనా రికార్డులు కొట్టాలంటే బాలయ్య తర్వాతనే..!










Next Story