సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'వీరసింహారెడ్డి'

Balakrsihna Veerasimha Reddy Completes Censor Work. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వీరసింహారెడ్డి'.

By Medi Samrat  Published on  9 Jan 2023 6:45 PM IST
సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న వీరసింహారెడ్డి

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ నెల 12న సినిమా విడుదలవుతోంది. తాజాగా, ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకుంది. వీరసింహారెడ్డికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కేటాయించింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషించింది. తమన్ సంగీతం అందించాడు. ఇటీవల ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో వేడుకగా జరిగింది.

అఖండతో భారీ హిట్ ను అందుకున్న బాలయ్య ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంటులో బాలకృష్ణ మాట్లాడుతూ .. "ఈ రోజు నుంచే సంక్రాంతి పండుగ మొదలైంది. అందువలన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా కసి తీరలేదు. విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాను. ఎప్పటికప్పుడు ఇంకా ఏదైనా కొత్తగా చేయాలనే తపన ఉండాలనేది నాన్నగారి నుంచి నేర్చుకున్నానని చెప్పారు. ఇక శ్రుతి హాసన్ లక్కీ హీరోయిన్ అనడం కంటే .. సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనడం కరెక్ట్. ఎందుకంటే తను చాలా కష్టపడి పైకొచ్చింది. తను మంచి డాన్సర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు." అని అన్నారు.


Next Story