కేజీఎఫ్-2లో బాల‌య్య‌.. తెలిపిన గూగుల్ త‌ల్లి..!

Balakrishna’s key role in KGF 2, says Google. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన కేజీఎఫ్ చాప్ట‌ర్‌-1 దేశ వ్యాప్తంగా ఎన్ని

By Medi Samrat  Published on  28 Dec 2020 7:11 AM GMT
కేజీఎఫ్-2లో బాల‌య్య‌.. తెలిపిన గూగుల్ త‌ల్లి..!

ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లైన కేజీఎఫ్ చాప్ట‌ర్‌-1 దేశ వ్యాప్తంగా ఎన్ని సంచ‌నాల‌ను సృష్టించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రంతో క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ కు దేశవ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. గోల్డ్ మాఫీయా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్-2పై ఎలాంటి అంచనాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వెల్ల‌డించాడు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో వార్త వైర‌ల్ అవుతోంది. అదేంటిదంటే.. ఈ చిత్రంలో బాలకృష్ణ నటిస్తున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. అంత భారీ సినిమాలో బాలయ్య లాంటి హీరో నటిస్తున్నారంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. ఇదే నిజం అయితే.. నంద‌మూరి అభిమానుల‌కు అయితే పూన‌కాలే.

నిజానికి `కేజీఎఫ్-2`లో బాలయ్య నటిస్తున్నారని చిత్రబృందం ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. కానీ, గూగుల్ మాత్రం `కేజీఎఫ్-2` సినిమా నటీనటుల జాబితాలో బాలయ్య పేరును చేర్చేసింది. గూగుల్ సెర్చ్ బార్‌లో కేజీఎఫ్‌-2 అని అని వెతికితే.. ఆ సినిమాలో న‌టీన‌టుల లిస్ట్‌లో మ‌న బాలకృష్ణ పేరును కూడా చూపిస్తోంది. అంతేకాదు.. నందమూరి నటసింహం ఫొటో కూడా కనిపించడం గమనార్హం. ఇనాయత్ ఖలీల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని గూగుల్ చెబుతుండడం విశేషం. నిజానికి ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడని సమాచారం.

నెటిజన్లు తమకు ఏ సందేహం వచ్చినా.. గూగుల్ నే ఆశ్రయిస్తారు. 'జై గూగుల్ తల్లి' అంటూ చాలా మంది కామెంట్లు కూడా చేస్తుంటారు. అంత పర్ఫెక్ట్ సమాచారం అందించే గూగుల్ లో చోటు చేసుకున్న ఈ వి'చిత్రం' ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


Next Story
Share it