బాల‌య్య బ‌ర్త్ డే రోజు అభిమానుల‌కు ఆ రెండు స‌ర్‌ప్రైజ్‌లు..!

Balakrishna Upcomoing Movie Teaser Released On 10th. నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు

By Medi Samrat  Published on  8 Jun 2022 7:55 PM IST
బాల‌య్య బ‌ర్త్ డే రోజు అభిమానుల‌కు ఆ రెండు స‌ర్‌ప్రైజ్‌లు..!

నందమూరి బాలకృష్ణ "అఖండ" సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకున్నారు. అది కూడా తక్కువ ధరకే టికెట్ రేట్లు ఉన్న సమయంలో భారీ కలెక్షన్స్ సాధించి బాలయ్య కెరీర్లలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

#ఎన్బీకే107 అంటూ అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమా లో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈనెల 10వ తేదీన బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమా టీజర్ ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ టీజ‌ర్‌ తోనే టైటిల్ కూడా ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి "రెడ్డిగారు" అనే టైటిల్ ని దాదాపుగా ఖాయం చేసేసిన‌ట్టు ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే టైటిల్ ని పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజర్ తో పాటు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ నెల 10వ తేదీన బాలయ్య బర్త్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను వదలనున్నట్టు ఫస్టు హంట్ లోడింగ్ అంటూ ఒక హింట్ ఇచ్చారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన బాలయ్య లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యతో తలపడే ప్రతినాయకుడిగా కన్నడ హీరో దునియా విజయ్ కనిపించనున్నాడు.












Next Story