నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

Balakrishna Tested For Covid Positive. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్,

By Medi Samrat  Published on  24 Jun 2022 5:40 PM IST
నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాను కరోనా బారినపడ్డట్లు తెలిపారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలియజేసారు. గత రెండు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ.. వెంటనే కరోనా పరీక్షలు చేసుకుని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, త్వరలో సాధారణ స్థితికి వస్తానని ఆశిస్తున్నానన్నారు. తన గురించి ఆందోళన చెందవద్దని తన అభిమానులు, శ్రేయోభిలాషులందరినీ కోరారు. ఇటీవలి కాలంలో నందమూరి బాలకృష్ణ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యారు.








Next Story