బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్
Balakrishna Sensational Comments. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తి చేసుకొన్
By Medi Samrat Published on 22 July 2021 6:44 PM ISTనందమూరి బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సినిమా రిలీజ్ అయి 30 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతరత్నని కించ పరుస్తూ మాట్లాడడమే కాకుండా రెహమాన్ , శ్రీదేవిలపై సంచలన కామెంట్స్ చేశారు. ఆదిత్య 369 సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ అందించగా ఆయనది ప్రత్యేకమని అన్నారు. ఇక మధ్యలో రెహమాన్ ది ఓ ప్రత్యేకమైన శైలి. ఆయన ఎవరో నాకు తెలియదు. పదేళ్లకు ఓ హిట్ ఇస్తారు. ఆస్కార్ అవార్డు అందుకొంటారని అన్నారు.
రామారావుకు ఏం అవార్డులు వచ్చాయని ఆయన మహనీయుడు అయ్యారు. భారతరత్న ఇవ్వకపోవడం వల్ల ఆయన కీర్తికి ఎలాంటి భంగం వాటిల్లదు. రామారావు గారికి భారతరత్న కాలి గోటితో సమానం. ఆయన కాలి చెప్పుతో సమానం. ఆ అవార్డు ఇచ్చినందుకు రామారావుకు గౌరవం కాదని అన్నారు.
ఆదిత్య 369 చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత రానురాను స్టార్ హీరోయిన్స్ దృష్టిని కూడా ఆకర్షించిందని తెలిపారు. ఆమె వేసుకొనే క్యాస్టూమ్స్, మేకప్ గురించి టాప్ హీరోయిన్లు ఆరా తీసేవారని అన్నారు. శ్రీదేవి లాంటి వాళ్లు కూడా ఆమె మేకప్, దుస్తులను అనుకరించే వాళ్లు అని బాలకృష్ణ చెప్పారు. గొప్ప డ్యాన్సర్లు అనుకొనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్ కూడా డ్యాన్సర్స్‌ని చూసి నేర్చుకున్నారు. శ్రీదేవి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసినట్టు డ్యాన్స్ చేసేది. శ్రీదేవి లాంటి నటీనటులకు నాన్నగారు కాళ్లు తొక్కి డ్యాన్స్, యాక్టింగ్ నేర్పించారు. వీపుపై గుద్ది. నడుముపై గిచ్చి , పిర్రలపై చరిచి నాన్నగారు డ్యాన్స్ నేర్పించారు. నాన్నగారు చాలా రఫ్ కాబట్టి కాళ్లు తొక్కి మరీ డ్యాన్స్ నేర్పించేవారని బాలయ్య వ్యాఖ్యలు చేశారు.