బాలయ్య 'వీర సింహా రెడ్డి' రిలీజ్ డేట్ ఫిక్స్

Balakrishna Next Movie Release Date Fix. నందమూరి బాలకృష్ణ త్వరలోనే ‘వీర సింహా రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By Medi Samrat  Published on  3 Dec 2022 7:18 PM IST
బాలయ్య వీర సింహా రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి బాలకృష్ణ త్వరలోనే 'వీర సింహా రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అఖండ సినిమా సెన్సేషనల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'క్రాక్‌' ఫేం గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం కూడా మరింత బజ్ కు కారణమైంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రాన్ని జనవరి 12న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు పోటీగా వాల్తేరు వీరయ్య, వారసుడు రిలీజ్‌ కానున్నాయి. బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. కన్నడ యాక్టర్‌ దునియా విజయ్‌ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్‌ జరిగిందని సమాచారం. ఈ సినిమాకు పోటీగా రిలీజవుతున్న వాల్తేరు వీరయ్య సినిమాను కూడా మైత్రీ సంస్థనే నిర్మిస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండబోతోందా..? అనే క్యూరియాసిటీ కూడా అభిమానుల్లో ఉంది. ఇక ఈ సంక్రాంతి సీజన్ లో చిరు, బాలయ్యల పోటికి రంగం సిద్ధమైంది.


Next Story