బాలయ్య కొత్త సినిమా వచ్చేస్తోంది.. పేరేంటో తెలుసా.?

టాలీవుడ్ నటుడు, బాలకృష్ణ కొత్త చిత్రం NBK109 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు.

By Medi Samrat  Published on  13 Nov 2024 9:00 PM IST
బాలయ్య కొత్త సినిమా వచ్చేస్తోంది.. పేరేంటో తెలుసా.?

టాలీవుడ్ నటుడు, బాలకృష్ణ కొత్త చిత్రం NBK109 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన చిత్రానికి డాకు మహారాజ్ అనే పేరు పెట్టారని సమాచారం. NBK 109 టైటిల్, టీజర్ అధికారిక లాంచ్ కోసం టీమ్ అన్ని ఫార్మాలిటీలను కూడా సిద్ధం చేసింది.

నవంబర్ 15వ తేదీ ఉదయం 9 గంటల నుంచి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌లు కూడా అభిమానులు, ప్రేక్షకుల కోసం ఉచితంగా ఇస్తున్నారు. ఈ ఈవెంట్‌లో టీమ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. బాబీ, బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

గతేడాది చిరంజీవితో వచ్చిన అవకాశాన్ని 'వాల్తేర్ వీరయ్య' తో బాబీ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి దర్శకుడి కెరీర్‌ కి మంచి బూస్టింగ్ ఇచ్చాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలయ్యను ఇప్పుడు NBK109 కోసం సిద్ధం చేశాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

Next Story