అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చల మల్లి సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేయనుంది. OTT స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి. కామెడీ పాత్రలకు పేరుగాంచిన నటుడు అల్లరి నరేష్ నాంది లాంటి క్యారెక్టర్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. మంచి ప్రశంసలు కూడా అల్లరి నరేష్ అందుకున్నాడు.
తన ఇమేజ్‌కి భిన్నంగా సినిమాలు చేసి భారీ సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయాడు. బచ్చల మల్లి సినిమా కూడా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం డిజిటల్ రంగ ప్రవేశానికి సిద్ధమవుతోంది. అల్లరి నరేష్ సినిమాని నమ్మి చాలా ప్రమోట్ చేసాడు కానీ అది బాక్సాఫీస్ వద్ద పని చేయలేదు. అతని నటనకు మాత్రమే ప్రేక్షకులు, విమర్శకుల నుండి కొంత ప్రశంసలు లభించాయి. అమృతా అయ్యర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. జనవరి 9న ప్రైమ్ వీడియోలో రాబోతోంది.