సినిమా హీరోయిన్ల వైవాహిక జీవితాలపై మరోసారి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

Astrologer Venu Swamy Predictions About Nayanthara and Vignesh Shivan Marriage Life. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గతంలో పలువురు సెలెబ్రిటీలపై కీలక వ్యాఖ్యలు

By Medi Samrat  Published on  11 May 2022 4:03 PM IST
సినిమా హీరోయిన్ల వైవాహిక జీవితాలపై మరోసారి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి గతంలో పలువురు సెలెబ్రిటీలపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..! ఆయన చేసిన వ్యాఖ్యలలో కొన్ని నిజమయ్యాయి కూడా..! తాజాగా మరి కొందరు నటీమణులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 9వ తేదీన తిరుమలలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నయనతార వైవాహిక జీవితంపై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతారకు వైవాహిక జీవితం అచ్చిరాదని, పెళ్లి తర్వాత ఆమె జీవితం సవ్యంగా సాగదని వేణు స్వామి చెప్పారు. నయన్ జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉన్నాడని.. అందువల్ల వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అన్నారు.

అనుష్క శెట్టి, రష్మిక మందన్నలకు కూడా పెళ్లి జీవితం అచ్చిరాదని చెప్పారు. వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నాడని అన్నారు. అక్కడి దాకా ఆగని ఆయన నయన తార, అనుష్క, రష్మికల సినీ కెరీర్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. వీరి కెరీర్ 2024 తర్వాత అంతమైపోతుందని చెప్పారు. నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే.. ఇక అనుష్క శెట్టి ఆచితూచి సినిమాలు చేస్తూ వెళుతోంది. అయితే రష్మిక మందాన కెరీర్ ఇప్పుడే పీక్ స్టేజీలో ఉంది. ఆమె అర డజనుకు పైగా సినిమాల్లో నటిస్తూ ఉంది. ఇంకో రెండేళ్లలో ఆమె కెరీర్ ముగిసిపోతుందని వేణు స్వామి చెప్పడం హాట్ టాపిక్ అయింది.










Next Story