క్యాన్సర్ మహమ్మారి యువ నటుడి ప్రాణాలను తీసింది. అస్సామీ నటుడు కిశోర్ దాస్ (30) క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు. క్యాన్సర్‌తో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. కిశోర్ గత ఏడాదికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ ఏడాది మార్చి నుంచి క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. అతడి పరిస్థితి విషమించడంతో ప్రాణాలను కోల్పోయాడు. క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న సమయంలోనే కొవిడ్-19 సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని వారాల కిందట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
కిశోర్ దాస్ 30 ఏళ్ల వయసులోనే చాలా మ్యూజిక్ వీడియోల్లో కనిపించాడు. అసోంలోని కమ్రూప్ ఆయన స్వస్థలం. కరోనా ప్రొటోకాల్స్ నేపథ్యంలో అంత్యక్రియలను శనివారం సాయంత్రం చెన్నైలో నిర్వహించారు. అస్సామీ ఇండ్రస్టీలో ఎక్కువగా పని చేసిన కిశోర్ దాస్.. బిధాత, బంధున్, నెదేఖా ఫగన్ తదితర అస్సామీ టెలివిజన్ షోలతో మంచి గుర్తింపును పొందాడు. అస్సామీలో 300కి పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించాడు.