ఆశిష్ విద్యార్థికి కంగ్రాట్స్ చెప్పడమే కాదు.. విమర్శల వర్షం కూడా

Ashish Vidyarthi gets married to fashion entrepreneur at 57. ప్రముఖ నటుడు ఆశీష్‌ విద్యార్థి అరవై సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు.

By Medi Samrat
Published on : 26 May 2023 10:48 AM

ఆశిష్ విద్యార్థికి కంగ్రాట్స్ చెప్పడమే కాదు.. విమర్శల వర్షం కూడా

ప్రముఖ నటుడు ఆశీష్‌ విద్యార్థి అరవై సంవత్సరాల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలి బారువాతో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. కోల్‌కతాలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో తాము రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని ఆశీష్‌ విద్యార్థి తెలిపారు. 20 ఏళ్ల క్రితం నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ఆశీష్‌ విద్యార్థి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్త్‌ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రుపాలీతో ఆశీష్‌ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త మొదట స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్‌ స్టోర్‌లో రూపాలీకి పార్టనర్‌షిప్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు 60 ఏళ్ల వయసులో తన కంటే చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. కొందరైతే ఏకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ పాపులర్ సినీ క్రిటిక్‌ కేఆర్కే కూడా విమర్శలు గుప్పించారు. "60 ఏళ్ళ నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు.. కొంచమైనా సిగ్గుండాలి భాయ్‌సాబ్" అంటూ కామెంట్స్ చేసాడు.


Next Story