మాస్ మహారాజ్ సినిమాలో యాక్షన్ కింగ్
Arjun Staring In Ravi Teja khiladi Movie. ఇలీవల క్రాక్ సినిమాతో హిట్టుకొట్టిన మాస్ హీరో రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి
By Medi Samrat Published on
30 Jan 2021 9:26 AM GMT

ఇలీవల క్రాక్ సినిమాతో హిట్టుకొట్టిన మాస్ హీరో రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నారు. ఈ విషయాన్ని అర్జున్ స్వయంగా.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.
తాను రవితేజ సినిమాలో నటించబోతున్నానని.. 2021లో కొత్తగా ఖిలాడి సినిమా సెట్స్‌లోకి వెళ్లబోతున్నానని అర్జున్ తన ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాలో తెలిపారు. ఇదిలావుంటే ఖిలాడి చిత్రబృందం కూడా అర్జున్ తమ సినిమాలో నటించబోతున్నాడని ప్రకటించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ పతాకంపై కోనేరు సత్యనారయణ నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే.. రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో గతంలో వీర సినిమా తెరకెక్కింది.
Next Story