మళ్లీ మెగా ఫోన్ పట్టిన యాక్షన్ కింగ్ అర్జున్.. హీరో ఎవరంటే..

Arjun Announces Movie With Vishwak Sen. యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు.

By Medi Samrat
Published on : 19 Jun 2022 9:00 PM IST

మళ్లీ మెగా ఫోన్ పట్టిన యాక్షన్ కింగ్ అర్జున్.. హీరో ఎవరంటే..

యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. తెలుగులో దర్శకత్వం వహించడమే కాకుండా.. తన కూతురు ఐశ్వర్య ని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు అర్జున్. ఐశ్వర్య ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు చేసింది.

విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ తన కొత్త సినిమాని అన్నౌన్స్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ రచయిత, దర్శకుడిగా.. విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తన కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకి నిర్మాత కూడా అర్జున్ కావడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని ప్రకటించనున్నారు.

శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. యంగ్ స్టార్ విశ్వక్ సేన్ 11వ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో పాటు నిర్మిస్తున్నారు. `అశోకవనంలో అర్జున కళ్యాణం` మూవీ విజయవంతం తర్వాత విశ్వక్ వరుసగా సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. 'గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్, ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ, ముఖ చిత్రాల్లో నటిస్తున్నాడు.
















Next Story