ఆర్జీవీని కలిసిన అరియానా.. ఎక్కడంటే..?
Ariyana Meet RGV In Goa. డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం ద్వారా యూత్ దృష్టిలో పడ్డ అరియానా..
By Medi Samrat Published on 8 Feb 2021 10:46 AM IST
డైరెక్టర్ ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడం ద్వారా యూత్ దృష్టిలో పడ్డ అరియానా.. బిగ్‌బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటికి దగ్గరయ్యింది. బిగ్‌బాస్ సీజన్- 4 ఫైనల్ వరకూ పోరులో నిలిచిన అరియానా ప్రస్తుతం టూర్‌లో ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ శ్రీముఖి, విష్ణు ప్రియ, సుసృత్, ఆర్జే చైతూతో కలిసి గోవాలో రచ్చ చేస్తుంది. ఆ టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంది.
అయితే.. ఆ టూర్‌లో తనకు అంత ఫేమ్ రావడానికి కారణమైన ఆర్జీవీని అరియానా కలిసింది. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. బిగ్ బాస్ తర్వాత నా ఫేవరేట్ అయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను కలిసాను. నాతో విలువైన సమయం గడిపినందుకు థ్యాంక్యూ సర్ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్‌బాస్‌కు ముందు ఎవరికి తెలియని అరియానా.. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే క్రమంలో.. ఏ అమ్మాయిని చూస్తే మీకు వావ్ అనిపిస్తుంది ఓ ప్రశ్న అడిగింది. దీనికి ఆర్జీవీ నిన్నే అని చెప్పాడు. అంతేకాదు నిన్ను బికినీలో చూడాలని ఉందని చెప్పడంతో.. ఆ ఇంటర్వ్యూతో పాటు.. అరియానా పేరు మార్మోగిపోయింది. దాంతో అరియానా టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాఫిక్ అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే.
Next Story