పోలీసులు వచ్చి వెళ్లగానే య‌జ‌మాని ఇళ్లు ఖాళీ చేయ‌మన్నాడు

సమయ్ రైనా హోస్ట్ చేసిన ఇండియాస్ గాట్ లాటెంట్‌లో రణ్‌వీర్ అల్లాబాడియా, ఆశిష్ చంచ్లానీలతో కలిసి ప్యానెల్‌లో ఉన్న అపూర్వ ముఖిజా అకా రెబెల్ కిడ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

By Medi Samrat
Published on : 19 Jun 2025 8:00 PM IST

పోలీసులు వచ్చి వెళ్లగానే య‌జ‌మాని ఇళ్లు ఖాళీ చేయ‌మన్నాడు

సమయ్ రైనా హోస్ట్ చేసిన ఇండియాస్ గాట్ లాటెంట్‌లో రణ్‌వీర్ అల్లాబాడియా, ఆశిష్ చంచ్లానీలతో కలిసి ప్యానెల్‌లో ఉన్న అపూర్వ ముఖిజా అకా రెబెల్ కిడ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అసభ్యకరమైన భాషను ఉపయోగించిన వివాదాస్పద క్లిప్ వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత వెంటనే ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ రియాలిటీ షో ది ట్రెయిటర్స్‌లో భాగమైన అపూర్వ, పోలీసులు తనను కలవడానికి వచ్చిన తర్వాత అద్దెకు ఉంటున్న భవనం నుండి బయటకు వెళ్లవలసి వచ్చిందని ఇటీవలి ఇంటర్వ్యూలో వెల్లడించింది. మషబుల్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అపూర్వ ముంబైలో ఉంటున్నప్పుడు ఆ బిల్డింగ్ అథారిటీ పోలీసులు వచ్చిన తర్వాత ఇల్లు ఖాళీ చేయమని కోరిందని వెల్లడించింది. పోలీసులు నా ఇంటికి నోటీసు ఇవ్వడానికి వచ్చినప్పుడు అపార్ట్మెంట్ కమిటీ.. ఇక్కడికి పోలీసులు వస్తున్నారు, ఇది తప్పు, అందుకే మేము బ్యాచిలర్లను అనుమతించము, ఒంటరి మహిళలకు అద్దెకు ఇవ్వమని ఫిర్యాదు చేశారని తెలిపింది. యజమాని తనను వెళ్ళిపోమని చెప్పాడని, ఆ ఇంట్లో ఒక సంవత్సరం మాత్రమే ఉన్నానని అపూర్వ చెప్పింది.

Next Story