అమరావతి: పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ హోంశాఖ మెమో జారీ చేసింది. కాగా ఈ నెల 25న ఓజీ మూవీ రిలీజ్ కానుంది. దీంతో ఓజి సినిమా బెనిఫిట్ షో ను 25వ తారీకు అర్ధరాత్రి ఒంటిగంటకు 1000 రూపాయలు టికెట్ రేట్ తో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్ 125 గాను, మల్టీప్లెక్స్ లలో 150 రూపాయలు గాను నిర్ధారణ చేశారు. ఈనెల 25వ తారీకు నుండి అక్టోబర్ నాలుగో తేదీ వరకు ఈ టికెట్ రేట్లు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ మెమో జారీ చేశారు.