టిల్లు స్క్వేర్ కు సంబంధించిన ఆ రెండు విషయాలే ఇప్పుడు హాట్ టాపిక్..!
సిద్ధు జొన్నలగడ్డ- నేహా శెట్టి నటించిన డీజే టిల్లు ఎంత భారీ హిట్ అయిందో తెలిసిందే.
By Medi Samrat Published on 21 Feb 2024 9:15 PM ISTసిద్ధు జొన్నలగడ్డ- నేహా శెట్టి నటించిన డీజే టిల్లు ఎంత భారీ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమా సీక్వెల్‌గా వస్తున్న 'టిల్లు స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. మార్చి 29న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు.. భారీగా చెల్లించినట్లు చెబుతున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా చాలా ఎక్కువే సినిమా కోసం ఓటీటీ సంస్థ ఇచ్చినట్లు చెబుతున్నారు.
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ బేస్ ను పెట్టుకున్న మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. టిల్లూ స్క్వేర్, డిజె టిల్లు సీక్వెల్ కోసం సిద్ధు జొన్నలగడ్డతో బోల్డ్‌గా నటించి, స్టీమీ సీన్స్‌లో నటించి తన అభిమానులతో సహా అందరినీ షాక్ కు గురి చేసింది. టిల్లు స్క్వేర్ సినిమా నుండి ఇద్దరు హీరోయిన్లు తప్పుకున్న విషయం ఇప్పటికే తెలిసిన విషయమే. అనుపమా కూడా బయటకు వచ్చేయాలని మొదట అనుకుంది. కానీ మాట ఇవ్వడంతోనే ఆమె సినిమాను పూర్తీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. టిల్లు స్క్వేర్ కోసం ఆమె గ్లామరస్ బార్‌ను ఎలా పెంచిందో, థియేట్రికల్ ట్రైలర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రం కోసం తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిందని తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా ఒక కోటి- రూ. 1.5 కోట్లు తీసుకునే నటి.. టిల్లు స్క్వేర్ కోసం రూ. 2 కోట్లు తీసుకుందని వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.