ఎన్నో ఏళ్లకు ఆ బాలీవుడ్ లెజెండ్ తెలుగులో..!

Anupam Kher Acts In Telugu. అనుపమ్ ఖేర్.. తెలుగు సినిమాలో నటింపజేయడానికి ఒప్పించారు.

By Medi Samrat  Published on  8 March 2021 9:58 AM GMT
Anupam Kher Acts In Telugu

అనుపమ్ ఖేర్.. దేశం గర్వించదగ్గ నటుల్లో ఆయన కూడా ఒకరు. హిందీ సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. ఆయనను తెలుగు సినిమాలో నటింపజేయడానికి ఒప్పించారు. ఇంతకూ ఆయన నటిస్తోంది ఏ సినిమాలోనో తెలుసా..? కార్తికేయ-2 సినిమాలో..! నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ సినిమా సీక్వెల్ మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా పెద్ద స్టార్స్ ను కూడా ఈ సినిమా కోసం తీసుకుంటూ ఉన్నారు. అందుకే బాలీవుడ్ లెజెండ్ అనుపమ్ ఖేర్ ను కార్తికేయ-2 కోసం చిత్ర బృందం సంప్రదించగా.. అందుకు ఆయన కూడా ఓకె చెప్పేసారు.

అనుపమ్ ఖేర్ గతంలో 1987లో వెంకటేశ్ హీరోగా కె.మురళీమోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన 'త్రిమూర్తులు' తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఇప్పుడు నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' సినిమా సీక్వెల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రకు అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేసిన విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.


Next Story
Share it