'గీతాంజలి' మళ్లీ వస్తోందట..!
నటి అంజలి కెరీర్ లో సూపర్ సక్సెస్ ను ఇచ్చిన సినిమా గీతాంజలి. 2014 లో వచ్చిన హారర్, సస్పెన్స్ సినిమా మంచి
By Medi Samrat Published on 23 Sept 2023 9:45 PM ISTనటి అంజలి కెరీర్ లో సూపర్ సక్సెస్ ను ఇచ్చిన సినిమా గీతాంజలి. 2014 లో వచ్చిన హారర్, సస్పెన్స్ సినిమా మంచి కమ్మర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. మేకర్స్ గీతాంజలి సీక్వెల్ ను తాజాగా ప్రకటించారు. ప్రతీకారం తీర్చుకోడానికి గీతాంజలి తిరిగి వస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అని మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
గీతాంజలి సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సెట్స్ పైకి వెళ్లింది. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమా, కెరియర్ పరంగా అంజలికి 50వ సినిమా. ఓ పాడుబడిన బంగ్లా ముందు అంజలి నేలపై చీకట్లో కూర్చుని ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా షూటింగు మొదలైంది. శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్ (డబ్బింగ్ ఆర్టిస్ట్), రాహుల్ మాధవ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. జీవీ దర్శకత్వం వహిస్తున్నారు. 2014లో విడుదలైన గీతాంజలి మంచి విజయం సాధించింది. హారర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్న తరుణంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే నటుడు శ్రీనివాస రెడ్డి హీరోగా మారాడు.