చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా 'మెగా 157' మీద మంచి క్రేజ్‌ఉంది. ఇక మెగా 157 టైటిల్ చిరంజీవి అసలు పేరు ఆధారంగా పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది, నిర్మాతలు 2026 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఆసక్తికరమైన వార్త ఏమిటంటే చిరంజీవి పాత్ర పేరు ఆయన అసలు పేరు శివ శంకర వర ప్రసాద్. ఈ టైటిల్ మెగాస్టార్ అభిమానులను ఖచ్చితంగా ఉత్సాహపరుస్తుంది. మెగా 157 టైటిల్ చిరంజీవి అసలు పేరు ఆధారంగా పెట్టారని వినిపిస్తూ ఉన్నాయి. 'మన శివ శంకర వర ప్రసాద్ గారు' అనే టైటిల్ అంటూ టాక్ నడుస్తోంది. దీనిపై అధికాటికా ప్రకటన రావాల్సి ఉంది. మెగాస్టార్ పుట్టినరోజున టైటిల్ టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భీమ్స్ సిసిరెలియో సంగీత దర్శకుడు.