నాగార్జున సినిమాలో నటించనున్న కోలీవుడ్ యువ నటి

Anikha Surendran in Nagarjuna Movie. టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' సినిమాలో అనికా సురేంద్రన్‌ నటించబోతోందట.

By Medi Samrat  Published on  10 Feb 2021 9:19 PM IST
Anikha Surendran in Nagarjuna Movie

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో నాగార్జున తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా నాగార్జున ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరులో ఈ సినిమా మొదలు పెట్టి షూటింగ్ కి కొబ్బరికాయ కొడతారంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక కార్యక్రమం జోరందుకుంది. ఈ క్రమంలో కీలక వార్త బయటికొచ్చింది.

ఇక అజిత్ సినిమా "ఎంత వాడు గాని, "విశ్వాసం" సినిమాలలో అలాగే దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద తీసిన "క్వీన్‌" వెబ్‌ సిరీస్‌లో జూనియర్‌ జయలలితగా నటించిన అనికా సురేంద్రన్‌ ఈ సినిమాలో నటించబోతోందట.యువ తరం దర్శకులతో పనిచేయడంపై నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు. అహిసోర్‌ సాల్మన్‌ అనే ఓ యువ దర్శకుడితో 'వైల్డ్‌ డాగ్‌'ని పూర్తి చేసిన నాగ్‌… ప్రవీణ్‌ సత్తారుతో తర్వాత చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపేశారు. నాగార్జున కోసం ప్రవీణ్‌ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ సిద్ధం చేశారు. ఇందులోనే అనికా సురేంద్రన్‌ కీలక పాత్రలో నటిస్తోందట. 'క్వీన్‌' తర్వాత అనికా వివిధ తమిళ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. ఈ నెలాఖరుకు లాంఛనంగా మొదలై.. వచ్చే నెల మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతున్నట్లు సమాచారం అందుతుంది. ఇక చూడాలి అనికా తెలుగులో ఎంత మాత్రం ఆకట్టుకుంటుందో.




Next Story