గోవాలో ర‌చ్చ చేస్తున్న బుల్లితెర రాముల‌మ్మ.. ఫిక్స్‌ వైర‌ల్

Anchor Srimukhi Goa Tour Pics Goes Viral. ఎప్పుడు షోల‌తో బిజీగా ఉండే బుల్లితెర రాముల‌మ్మ‌ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది.

By Medi Samrat  Published on  5 Feb 2021 8:24 AM IST
Anchor Srimukhi Goa Tour Pics Goes Viral.

ఎప్పుడు షోల‌తో బిజీగా ఉండే బుల్లితెర రాముల‌మ్మ‌ శ్రీముఖి ప్ర‌స్తుతం గోవాలో ర‌చ్చ చేస్తుంది. త‌న స్నేహితుల‌తో గోవాలో సేద తీరుతుంది. యాంక‌ర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు ప‌లువురు స్నేహితుల‌తో క‌లిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఇందుకు సంబంధించి వీడియో‌లు, ఫొటోలు త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా త‌న ఫాలోవ‌ర్ల‌తో పంచుకోగా.. అవి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.



యాంక‌ర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో విష్ణు ప్రియ ప్ర‌కృతిని ఆస్వాదిస్తూ త‌కిట త‌దిమి తందానా అని అనిపిస్తుంది అని చెబుతుండ‌గా.. దానికి శ్రీముఖి హృద‌య ల‌య‌ల థిల్లానా అని శృతి క‌లిపింది. అంద‌మైన ప్ర‌కృతిని వీరిద్ద‌రు ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న‌ట్టు తాజా పోస్ట్‌ల‌ని చూస్తుంటే అర్ధ‌మ‌వుతుంది. ఇదిలావుంటే.. అప్పుడ‌ప్పుడు సినిమాల‌లో మెరిసే శ్రీముఖి ప్ర‌స్తుతం 'క్రేజీ అంకుల్స్' చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమా త్వ‌ర‌లోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతుంది.


Next Story