తనకు మేనేజర్‌గా పని చేసిన మహేంద్ర రిలీవ్ అయ్యారంటూ యాంకర్ అనసూయ తెలిపారు. తన సుధీర్ఘమైన సీనీ ప్రయాణంలో తోడుగా ఉన్న మేనేజర్ మహేంద్ర పదవి నుంచి రిలీవ్ అయ్యారని అనసూయ వివరించారు. "ఎన్నో ఏళ్ల మా అనుబంధంలో ఎంతో నేర్చుకున్నాం. ఇన్నాళ్లుగా నాకు మేనేజర్‌గా ఆయన చూపిన సమయం, కృషి, నిబద్ధతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇకపై ఏదైనా అధికారిక ఉత్తరప్రత్యుత్తరాల కోసం, వృత్తిపరమైన విషయాల కోసం దయచేసి enquiry.anusuyabharadwaj@gmail.com మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ నెంబర్‌కి మా టీం కాంటాక్ట్ అవుతారు" అని అనసూయ తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.