కాంతారాకు అనసూయ కూడా ఫిదా..!

Anchor Anasuya Bharadwaj interesting comments on Kantara. కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  6 Dec 2022 5:15 PM IST
కాంతారాకు అనసూయ కూడా ఫిదా..!

కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్‌ శెట్టిపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్న సంగతి తెలిసిందే..! తాజాగా టాలీవుడ్‌ నటి, ప్రముఖ యాంకర్‌ అనసూయ రిషబ్‌ శెట్టిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా అనసూయ తన ఇన్ స్టాలో ఫాలోవర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఒకరు ఓ మంచి సినిమాను రెకమండ్‌ చేయమని అడగ్గా.. 'కాంతార' అని సమాధానం ఇచ్చింది అనసూయ. హీరో రిషబ్‌ శెట్టి సినిమాలో అద్భుతంగా నటించారు. నేను ఇంకా ఆ సినిమా ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నా అని చెప్పుకొచ్చింది.

ఇక కాంతారా సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. పాన్ ఇండియన్ సినిమాగా భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రం "కాంతారా" అందరి ప్రశంసలు అందుకుంది. రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని ఏకంగా 400 కోట్లను దాటింది.


Next Story