ఏడ్చేసిన అనసూయ..
అనసూయ అంటే ఎంతో స్ట్రాంగ్ పర్సన్ అని మనం అనుకుంటూ ఉంటాం.
By Medi Samrat Published on 19 Aug 2023 5:03 PM ISTఅనసూయ అంటే ఎంతో స్ట్రాంగ్ పర్సన్ అని మనం అనుకుంటూ ఉంటాం. ట్రోల్స్ ను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న మహిళ. అలాంటి అనసూయ ఏడుస్తూ వీడియో పెడితే షాక్ అవ్వడం మన అందరివంతవుతుంది. నటి అనసూయ తాజా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టులో పంచుకున్న వీడియోలో అనసూయ భోరున ఏడుస్తుండడం చూడొచ్చు. ఈ పోస్టు కింద అనసూయ వివరణ ఇచ్చారు.
ఈ పోస్టు చూసి అందరూ అయోమయానికి గురవుతారని తనకు తెలుసని.. ప్రపంచవ్యాప్తంగా, సోషల్ మీడియా అంటే వ్యక్తుల మధ్య సంబంధాలను పెంపొందించడం, ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకోవడం, పరస్పరం సంస్కృతి, జీవన విధానాలను అనుభూతి చెందడం, సంతోషాన్ని వ్యాపింపచేయడం వంటి అంశాల కోసం అనుకుంటారని అన్నారు. ఇవాళ సోషల్ మీడియా చూస్తే వీటిలో ఒక్కటైనా కనిపిస్తోందా అంటూ అనసూయ విస్మయం వ్యక్తం చేశారు. "ఈ పోస్టు ఎందుకు పెట్టానో చెబుతాను. ఫొటోలకు పోజులివ్వడం, కెమెరా ముందు ఫొటో షూట్లు, సంతోష సమయాలు, నవ్వులు, డ్యాన్సులు, మాటకు మాట బదులివ్వడాలు, ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడడం... ఇవన్నీ నా జీవితంలో ఒక భాగం అయ్యాయి.
కొన్నిసార్లు నేను బలహీనపడిన క్షణాలు ఉన్నాయి, సమస్యలను దీటుగా ఎదుర్కోలేని సమయాలు ఉన్నాయి, కుంగిపోయిన సందర్భాలూ ఉన్నాయి. ఏడుపు వస్తే ఏడ్చేయాలి... మళ్లీ చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రపంచం ఎదుటకు రావాలి. విశ్రాంతి తీసుకోండి... పునరుజ్జీవం పొందండి... అంతేకానీ, సమస్యల నుంచి పారిపోవద్దని తెలిపింది అనసూయ. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని నిందిస్తేనో, పట్టించుకోకపోతేనో.. అతడికి లేదా ఆమెకు ఆ రోజు మంచి రోజు కాదేమో అనుకోండి. వారి మనసులో ఎలాంటి దురాలోచనలు ఉన్నాయో ఊహించడానికి ప్రయత్నించండి. కనీసం వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినప్పటికీ, ఎదుటివాళ్ల గురించి ఏమీ తెలియనప్పటికీ ఇతరులను బాధించడానికి వారు చేసే పనులను గమనించండి. వారికి కనీస మానవత్వం ఇవ్వు దేవుడా అని ప్రార్థించండి. ఇప్పుడు నేనిలాగే ఆలోచిస్తున్నాను. ఇప్పటికిప్పుడైతే నేను బాగానే ఉన్నాను. ఈ వీడియో ఐదు రోజుల నాటిదని అనసూయ చెప్పుకొచ్చింది.