Video : 'చెప్పు తెగుద్ది'.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!

సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో పాల్గొన్నారు.

By Medi Samrat
Published on : 2 Aug 2025 3:45 PM IST

Video : చెప్పు తెగుద్ది.. ఆక‌తాయిల‌కు అన‌సూయ వార్నింగ్‌..!

సినీ న‌టి, యాంక‌ర్ అన‌సూయ ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో ఓ షాపింగ్‌మాల్ ప్రారంభోత్సవం‌లో పాల్గొన్నారు. అక్క‌డ‌ త‌న‌పై కొంద‌రు యువ‌కులు అసభ్య కామెంట్లు చేయ‌డంతో 'చెప్పు తెగుద్ది' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అన‌సూయ మాట్లాడుతున్న స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన కొంద‌రు కామెంట్లు చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో అన‌సూయ వారికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చారు. చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య కుటుంబ స‌భ్యుల‌ను ఇలాగే కామెంట్లు చేస్తే ఊరుకుంటారా అంటూ క్లాస్ పీకారు. పెద్ద‌వాళ్ల‌కి మ‌ర్యాద ఇవ్వ‌డం మీ ఇంట్లో నేర్పలేదా? వెరీ బ్యాడ్‌ అంటూ అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


Next Story