నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి మాత్రమే వెళతాడు : అమ్మ రాజశేఖర్

Amma Rajashekar Sensational Comments On Hero Nithin. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు 'అమ్మ' రాజశేఖర్ టాలీవుడ్ హీరో నితిన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 11 July 2022 7:23 PM IST

నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి మాత్రమే వెళతాడు : అమ్మ రాజశేఖర్

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు 'అమ్మ' రాజశేఖర్ టాలీవుడ్ హీరో నితిన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'అమ్మ' రాజశేఖర్ తాజాగా 'హై ఫైవ్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ వస్తానని మాటిచ్చారని, కానీ ఆయన హాజరు కాలేదని దర్శకుడు 'అమ్మ' రాజశేఖర్ ఆరోపించారు. వీలుకాకపోతే రాలేనని నేరుగా చెప్పేయాల్సిందని, వస్తానని చెప్పి రాకపోవడం తనను ఎంతో బాధించిందని 'అమ్మ' రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

వస్తానని మాట ఇచ్చాడు. కానీ రాలేదని బాధపడ్డాడు అమ్మ రాజశేఖర్. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని. కానీ నితిన్ నన్నే మరచిపోయాడని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. కెరీర్ లో మనం ఎదిగినందుకు సహాయపడ్డవారిని మరచిపోకూడదు.. కానీ నితిన్ నన్ను మరచిపోయాడు. నితిన్ కి డ్యాన్స్ రాదు.. కానీ నేను డ్యాన్స్ నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చానన్నారు అమ్మ రాజశేఖర్. కానీ నా ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ రాలేదు. నితిన్ ప్రస్తుతం బిజీగా లేడు.. ఇంట్లో ఉండి కూడా రాలేదు. కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడిగా.. అది కూడా చేయలేదన్నారు. మనకు సాయం చేసిన వాళ్ళని మరచిపోకూడదు. నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి వెళతాడు. కానీ నన్ను అవమానించాడని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. నితిన్ కు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి 10 రోజుల కిందటే చెప్పానని తెలిపారు. నితిన్ వస్తున్నాడు కదా అని, తిండి కూడా మానుకుని ప్రత్యేకంగా ఏవీ తయారుచేయించానని 'అమ్మ' రాజశేఖర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నితిన్ టక్కరి చిత్రంలో నటించాడు. ఆ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.











Next Story