అల్లు అర్జున్ సండే మార్నింగ్ ఎలా గడిచిందంటే..!

Allu Arjun's Sunday morning is all about colouring with kids Arha and Ayaan. అల్లు అర్జున్ పిల్లలు అర్హా, అయాన్ లు సోషల్ మీడియాలో చేసే సందడి

By Medi Samrat  Published on  31 Jan 2022 5:40 AM GMT
అల్లు అర్జున్ సండే మార్నింగ్ ఎలా గడిచిందంటే..!

అల్లు అర్జున్ పిల్లలు అర్హా, అయాన్ లు సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ తో కలిసి చేసే సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటారు. ఆదివారం ఉదయం అల్లు అర్జున్ తన పిల్లలతో గడిపిన మరో అందమైన ఫోటోను అల్లు స్నేహ షేర్ చేశారు. ఫోటోలలో అల్లు అర్జున్ అర్హాతో కలిసి కలరింగ్‌ వేస్తున్నట్లు గమనించవచ్చు. టాలీవుడ్ స్టార్ దుబాయ్ నుండి దాదాపు 16 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇప్పుడు తన కుటుంబంతో ఉండటానికి తగినంత సమయం తీసుకుంటున్నారు.


ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు కుమార్తె నుంచి ఘనస్వాగతం లభించింది. తన కుమార్తె అర్హా తనను ఇంటికి స్వాగతిస్తున్న ఫోటోను పంచుకుంటూ, "విదేశాలలో 16 రోజుల తర్వాత మధురమైన స్వాగతం" అని అల్లు అర్జున్ ఫోటోను పోస్టు చేశాడు. వృత్తిపరంగా, పుష్ప: ది రైజ్ విజయం తర్వాత అల్లు అర్జున్ కొంత విరామం తీసుకున్నాడు. తన కుటుంబం, స్నేహితులతో తగినంత సమయం గడుపుతున్నాడు. కుటుంబంతో కలిసి గోవాలో విహారయాత్ర ముగించుకుని ఇటీవలే దుబాయ్ కి వెళ్లి వచ్చాడు. అల్లు అర్జున్ త్వరలో పుష్ప రెండవ భాగం పుష్ప: ది రూల్ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు.
Next Story
Share it