రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు.. అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సినిమా రికార్డ్‌

Allu Arjun 'Pushpa ' film rakes in Rs 100 crore worldwide. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అయ్యింది.

By అంజి  Published on  19 Dec 2021 9:17 AM GMT
రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు.. అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్ సినిమా రికార్డ్‌

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్‌ అయ్యింది. సినిమా థియేటర్లలో అభిమానుల సందడి నెలకొంది. బాక్సాఫీస్‌ వద్ద 'పుష్ప' సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే 'పుష్ప' సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లను కొల్లగొట్టింది. కాగా ఈ సినిమా ఇంకా రికార్డులు బ్రేక్‌ చేసేలా కనిపిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రిస్మస్ విడుదలకు ముందు కనీసం ఒక వారం పాటు నిలకడగా ఉంటుందని భావిస్తున్నారు. పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ఐదు భాషల్లో పాన్-ఇండియాగా విడుదలైంది. రెండు భాగాలుగా రూపొందనున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం ప్రాంతానికి చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల జీవితాల ఆధారంగా రూపొందించబడింది. విడుదలైన రెండవ రోజు పుష్ప: ది రైజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్కును దాటింది. ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు.

యుఎస్‌ఎలో కూడా పుష్ప బాక్సాఫీస్ వద్ద మంచి రన్ చేస్తోందని ట్రేడ్‌ అనలిస్ట్‌లు చెబుతున్నారు. ఇంకా చాలా ఫారిన్ లొకేషన్స్‌లో రిలీజ్ చేసి ఉంటే పుష్ప మరింత వసూళ్లు చేసి ఉండేది. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో సినిమా విడుదల కాలేదని, దీంతో ఓవర్సీస్ బిజినెస్ దెబ్బతిందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ వెల్లడించారు. పుష్పలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. సినిమా రెండవ భాగం వచ్చే ఏడాది తర్వాత థియేటర్లలోకి రానుంది. త్వరలో మేకర్స్ దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను షేర్ చేస్తారు.


Next Story