అల్లు అర్హ బర్త్‌ డే.. స్పెషల్ గిప్ట్‌ ఇచ్చిన తల్లి స్నేహా.!

Allu arha birthday special gift. ఇవాళ అల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అర్హ బర్త్‌ డే. 2016, నవంబర్‌ 21న పుట్టిన అర్హ.. ఇప్పుడు ఆరో ఏటలోకి అడుగుపెడుతోంది.

By అంజి  Published on  21 Nov 2021 5:49 AM GMT
అల్లు అర్హ బర్త్‌ డే.. స్పెషల్ గిప్ట్‌ ఇచ్చిన తల్లి స్నేహా.!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్‌ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమయం దొరికినప్పుడల్లా తన భార్య, పిల్లలతో అల్లు అర్జున్‌ సరదాగా గడుపుతుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కానీ, ఫొటోలను కానీ ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన అభిమానులకు అన్ని విషయాలు చెబుతుంటారు. ఇక అల్లు అర్జున్‌ భార్య స్నేహ కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను ఆమె షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

ఇవాళ అల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అర్హ బర్త్‌ డే. 2016, నవంబర్‌ 21న పుట్టిన అర్హ.. ఇప్పుడు ఆరో ఏటలోకి అడుగుపెడుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను అల్లు అర్జున్‌ భార్య స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోల్‌ అర్హ్‌ చెస్‌ ఆట ఆడుతూ కనిపిస్తుంది. చేస్‌ బోర్డులో పావులను కదుపుతూ ఎగిరి గంతులేస్తుంది. అర్హ గేమ్‌ ఆడుతుండగా.. ఆ గేమ్‌ను చూస్తూ అల్లు అర్జున్‌, స్నేహ, తాతా అల్లు అరివింద్‌ చూస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టా పోస్ట్‌లో 'హ్యాపీ బర్త్‌డే అర్హ.. మై హోల్‌ హార్ట్‌' అంటూ స్నేహ వీడియో షేర్‌ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అల్లు అర్జున్‌ అభిమానులు అర్హకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Next Story
Share it