నాంది సెన్సార్ రివ్యూ..
Allari Naresh Naandhi Movie Censor Review. అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ హీరోగా అనేక
By Medi Samrat Published on 14 Feb 2021 8:16 AM GMTఅల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ హీరోగా అనేక సినిమాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అల్లరి నరేష్. అంతేకాదు,నేను సినిమా తరువాత చాలా ఏళ్లకు రీసంట్ గా నాంది అంటూ ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.హరీష్ శంకర్ శిష్యుడు డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలోఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుంది. అల్లరి నరేష్ జైల్లో నగ్నంగా కనిపించి మరో శేషుని తలపిస్తున్న ఈ మూవీకి సెన్సార్ 'U/A' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 19న రిలీజ్ కాబోతోంది.
ఈ టైమ్ లో సెన్సార్ సినిమాపై మంచి రిపోర్ట్ ఇవ్వడంతో ఈసినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. అల్లరి నరేష్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమా అంటూ సెన్సార్ టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగ్స్ చాలాబాగా ఆకట్టుకున్నాయని, డైరెక్టర్ కొత్తవాడైనా చాలా చక్కగా సినిమాని తీశాడని చెప్తున్నారు. అంతేకాదు, ఫస్ట్ హాఫ్ అంతా కూాడ సినిమా సమాజంలో జరిగే పరిస్థితులని ఆలోచింపజేసే విధంగా ఉందని అన్నారు. ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ యాక్టింగ్, అల్లరి నరేష్ యాక్టింగ్ హైలెట్ అని చెప్తున్నారు. ఈసినిమాపై అల్లరి నరేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు, కెరియర్ మొదట్లో చేసిన నేను, ప్రాణం సినిమాల్లాగా ఇది అల్లరి నరేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.