నాలుగు రోజుల పాటూ అలియా-రణబీర్ పెళ్లి సందడి

Alia Bhatt and Ranbir Kapoor wedding to be a 4-day event. అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి గురించి బాలీవుడ్ లో తెగ చర్చించుకుంటూ ఉన్నారు.

By Medi Samrat  Published on  8 April 2022 2:30 PM GMT
నాలుగు రోజుల పాటూ అలియా-రణబీర్ పెళ్లి సందడి

అలియా భట్, రణబీర్ కపూర్ పెళ్లి గురించి బాలీవుడ్ లో తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఈ జంట నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అలియా మామ రాబిన్ భట్ వివాహ తేదీని ధృవీకరించారని మీడియా సంస్థలు చెబుతున్నాయి. వారి పెళ్లి 4 రోజుల పాటు జరగనుందని రాబిన్ భట్ వెల్లడించారు.

అలియా-రణబీర్‌ల వివాహం 4 రోజుల ఈవెంట్

ఇండియా టుడేతో మాట్లాడిన రాబిన్ భట్, అలియా భట్, రణబీర్ కపూర్ల వివాహం 4 రోజుల వేడుకగా ఉంటుందని చెప్పారు. భట్ కుటుంబం తనను ఫంక్షన్లకు ఆహ్వానించినట్లు ఆయన ధృవీకరించారు. ఏప్రిల్ 15 నుండి పెళ్లి సందడి మొదలవుతుందని తెలిపారు. రాబిన్ భట్ రచయిత, చిత్రనిర్మాత విక్రమ్ భట్ తండ్రి.

ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా భట్ మరియు రణబీర్ కపూర్ ఎట్టకేలకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారు ఏప్రిల్ 15, 2022న వివాహం చేసుకోనున్నారు. వారి మెహందీ వేడుక ఏప్రిల్ 13న జరుగుతుంది, ఆ తర్వాత మరుసటి రోజు సంగీత్ వేడుక జరుగుతుంది. ఈ జంట తమ పెళ్లికి బాలీవుడ్‌లోని కొందరిని ఆహ్వానించారు. వారు రిసెప్షన్ కోసం పెద్ద ఎత్తున అతిథులను పిలవనున్నారు. "రణబీర్-అలియాల వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరగనుంది. రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, షారుఖ్ ఖాన్, అయాన్ ముఖర్జీ, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ వంటి బాలీవుడ్ ప్రముఖులను ఆహ్వానించారు. " అని కొందరు మీడియాకు తెలిపారు. రాబోయే రోజుల్లో వీరికి పెళ్ళికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియనున్నాయి.
Next Story
Share it