అక్షయ్ కుమార్.. రెమ్యునరేషన్ రేంజే వేరయా..!

Akshay Kumar slashes down his price for Bachchan Pandey. అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో టాప్ స్టార్. వరుసగా సినిమాలు చేసు

By Medi Samrat  Published on  14 Dec 2020 5:00 PM IST
అక్షయ్ కుమార్.. రెమ్యునరేషన్ రేంజే వేరయా..!

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ లో టాప్ స్టార్. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతూ ఉన్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'లక్ష్మీ బాంబ్' సినిమా మినహా ఇంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరు. తాజాగా అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ కు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఇబ్బందుల కారణంగా నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండగా.. అక్షయ్ కుమార్ కూడా రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడట. ఇంతకూ అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? 99 కోట్ల రూపాయలు.

అక్ష‌య్ కుమార్ మాత్రం 99 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. బ‌చ్చ‌న్ పాండేకి ఈ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అక్ష‌య్ కుమార్ రెమ్యున‌రేష‌న్ ఇంతకు ముందు 120 కోట్లు ఉండేద‌ట‌. దాదాపు 20 కోట్లు త‌క్కువే తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అక్షయ్ కుమార్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ ఎలాగూ ఉంటాయి. ఇక శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ ఎలాగూ ఉంటాయి. అదీ కాకుండా అక్షయ్ కుమార్ డేట్స్ ఇవ్వడం అంటే చాలా కష్టం.. రెండు, మూడు సంవత్సరాలకు సరిపడా షెడ్యూల్ తో ఉన్నాడు అక్షయ్ కుమార్. అందుకే ఆయన ఈ రేంజిలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటాడనే ప్రచారం జరుగుతూ ఉంది.


Next Story