ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?

భారత ప్రధాని మోడీని అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్‌ హౌస్‌లో శుక్రవారం కలిశారు.

By Knakam Karthik
Published on : 7 Feb 2025 5:43 PM IST

Cinema News, Telugu News, Tollywood, Entertainment, Pm Modi, Akkineni Family

ప్రధాని మోడీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ.. ఎందుకో తెలుసా?

భారత ప్రధాని మోడీని అక్కినేని ఫ్యామిలీ పార్లమెంట్‌ హౌస్‌లో శుక్రవారం కలిశారు. మోడీని కలిసిన వారిలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఉన్నారు. అక్కినేని నాగేశ్వరావు గురించి ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన పుస్తకాన్ని మోడీకి అందించారు. అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సినీ రంగానికి ఏఎన్నార్ చేసిన ప్రధాని ప్రశంసించినట్లు సమాచారం. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఏఎన్నార్ ను ప్రశంసించారు మోడీ. ఆ సమయంలో సోషల్ మీడియా వేదికగా పీఎంకి కృతఙ్ఞతలు తెలిపాడు నాగార్జున.

కాగా నాగ చైతన్య హీరోగా నటించిన 'తండేల్' మూవీ ఈరోజు (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అక్కినేని అభిమానులు ఆ ఆనందంలో ఉండగానే, ఇదే రోజు మోడీని అక్కినేని ఫ్యామిలీ కుటుంబ సమేతంగా కలవడం మరింత ప్రత్యేకంగా మారింది. అటు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్‌గా మారాయి.

Next Story