ఏజెంట్ టీజర్.. అక్కినేని అఖిల్ యాక్షన్ మేనియా మొదలుకాబోతోంది

Akhil Agent Teaser Out Now. అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వం

By Medi Samrat  Published on  15 July 2022 6:08 PM IST
ఏజెంట్ టీజర్.. అక్కినేని అఖిల్ యాక్షన్ మేనియా మొదలుకాబోతోంది

అక్కినేని అఖిల్ నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా 'ఏజెంట్'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ మీల్స్ అభిమానులకు ఇవ్వబోతోంది. టీజర్ లో అఖిల్ యాక్షన్ ఒక రేంజిలో చేశాడని మనకు అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం బాడీని కూడా భారీగా పెంచేశాడు అఖిల్. టీజర్ లో కూడా బాడీని చూపించారు. ఇక ఏజెంట్ గా అఖిల్ విన్యాసాలను బిగ్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఆరాట పడుతూ ఉన్నారు.


అఖిల్ ఈ చిత్రానికి రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం లేద‌ట. సినిమా క్వాలిటీ ముఖ్యమని.. అందులో భాగంగా ప్రస్తుతం ఆయన ఎటువంటీ రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని అంటున్నారు. అయితే ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్ల‌లో వాటా తీసుకుంటున్న‌ట్లు టాక్ నడుస్తోంది. అఖిల్ ఈ చిత్రం కోసం కంప్లీట్‌గా మేకోవ‌ర్ అయ్యారు. స్టైలీష్ లుక్‌లో కండ‌లు తిరిగిన దేహంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. అఖిల్‌కు జోడిగా కొత్త అమ్మాయి సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. యూరప్‌లోని హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో షూటింగ్ చేసింది టీమ్. హాలీవుడ్ రేంజి మూవీ అని మాత్రం మూవీ మేకర్స్ చెబుతూ ఉన్నారు.








Next Story