అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. భారీగా ప్లాన్

Akhanda Pre Release Event. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 'అఖండ'. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్

By Medi Samrat  Published on  18 Nov 2021 7:42 AM GMT
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే.. భారీగా ప్లాన్

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా 'అఖండ'. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్ లు అభిమానులకు తెగ నచ్చాయి. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా అఘోర క్యారెక్టర్ కు సినిమా థియేటర్లో రచ్చ రచ్చేనని భావిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ ను ఎప్పుడూ చూడని పాత్రలో మనం చూస్తున్నాం. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. భారీ హైప్ ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో ఈ వేడుక నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27న గానీ 28న గాని ఈ ఫంక్షన్ ను నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

టీజర్-ట్రైలర్ కు భారీ రెస్పాన్స్

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తోంది.ఈ సినిమాలో బాలయ్య అఘోర గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అఘోర కాకుండా మరో రెండు పాత్రల్లో అలరించనున్నట్టు సమాచారం. బాలయ్య డైలాగులు కూడా అదిరిపోయాయి. అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా.. పట్టుసీమ తూమా.. ఒక మాట నువ్వంటే శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. దైవ శాసనం.. ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్‌డోజర్‌ని.. తొక్కిపారదొబ్బుతా.. మీకు ఏదైనా సమస్య వస్తే దండం పెడతారు.. మేమా సమస్యకు పిండం పెడతామంటూ బాలయ్య చెప్పిన డైలాగులు ఇప్పటికే అభిమానులు బట్టీ పట్టేస్తున్నారు.


Next Story
Share it