నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల 'అఖండ 2' సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 25 నుండి విడుదల కావాల్సి ఉంది. ఆ సినిమా ఇప్పుడు వాయిదా పడింది. బాలయ్య అఖండ 2 వాయిదాకు తమన్ కారణమని తెలిపారు బాలకృష్ణ. సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయబోమని మేకర్స్ ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, సంగీత దర్శకుడికి సమయం సరిపోలేదని అన్నారు. డిసెంబర్ ప్రారంభంలో విడుదల అవుతుందని, మొదటి భాగం కంటే 50 రెట్లు గొప్పదని ఆయన అన్నారు." అఖండ-2 సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. తమన్ సంగీతంపై మరింత సమయం కావాలని అన్నాడు. అఖండ విడుదల సమయంలో సౌండ్ వూఫర్లు బద్దలయ్యాయి. కానీ అఖండ-2 డిసెంబర్‌లో దానికంటే 50 రేట్లు పెద్దగా ఉంటుంది. త్వరలో కచ్చితమైన రిలీజ్ తేదీని ప్రకటిస్తాము. అభిమానుల అంచనాలను మించి ఉంటుంది. బాక్సాఫీసులో చరిత్ర సృష్టించబోతున్నాము’’అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు
సెప్టెంబర్ 25న, పవన్ కళ్యాణ్ OG థియేటర్లలోకి వస్తుంది. రెండు చిత్రాలకు తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ సీక్వెల్ డిసెంబర్ 4 లేదా 5 తేదీల్లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.