ఇడ్లీ తిని లక్ష రూపాయలు ఇచ్చిన హీరో.. ఎవరంటే?
Ajit Helps Hyderabadi Idli Vendor. సాధారణంగా సినిమాల్లో హీరోలు ఏం కావాలంటే అది చేస్తుంటారు. హీరో అజిత్ అది నిరూపించారు ఇడ్లి అతనికి లక్ష రూపాయలు ఇచ్చారు
By Medi Samrat Published on 21 Jan 2021 10:28 AM ISTసాధారణంగా సినిమాల్లో హీరోలు ఏం కావాలంటే అది చేస్తుంటారు. తన వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. సినిమాలలో వారు నటించే పాత్రలలో కొన్నిసార్లు ప్రాణాలను సైతం వదలడానికి లెక్కచేయరు. అయితే ఈ పాత్రలన్నీ కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో ఇలాంటి హీరోలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఆ విధంగా అరుదుగా కనిపించే వారిలో హీరో అజిత్ ఒకరని చెప్పవచ్చు. తన వాళ్ళ కోసం, కష్టాలతో తన దగ్గరకు వచ్చిన వారి కోసం తను ఎలాంటి సాహసానికైనా వెనుకాడడు.
ఈ నేపథ్యంలోనే ఒక రోజు టెక్నీషియన్స్, డ్రైవర్స్ కునిర్మాత డబ్బులు ఇవ్వడం లేదంటూ అజిత్ దగ్గరికి వచ్చి వారి బాధను చెప్పుకున్నారు. అప్పుడు అజిత్ నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వెళ్లి నిర్మాతని అడగండి అంటూ చెప్పడంతో వారు అజిత్ ఏంటి? ఇలా అన్నారు అని భావించి వారి పనులకు వెళ్లారు. కానీ అజిత్ షూటింగ్ నుంచి మధ్యలో వెళ్ళిపోయి వారి బకాయిలన్ని తీర్చి, వారిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు.
హీరో అజిత్ కు హైదరాబాద్ ఎంతో విడదీయరాని బంధం ఉంది.చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తన సొంత ఊరికి వచ్చానని ఫీల్ అవుతారు. ఈ నేపథ్యంలోనే అజిత్ తాజాగా నటిస్తున్న 'వాలిమై' సినిమా షూటింగ్ లో భాగంగా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో భాగంగానే హీరో అజిత్ తన సిబ్బందిని పక్కనపెట్టి బైక్ పై నగర వీధులన్నీ చక్కర్లు కొడుతున్నాడు.
ఇందులో భాగంగానే రోజు రాత్రి తనకు దగ్గరగా ఉన్న ఇడ్లీ బండి దగ్గరికి వెళ్లి ఇడ్లీలు తినేవాడు. ఆ విధంగా ఇడ్లీల కోసం వెళ్లిన అజిత్ ఆయన గురించి అడిగి తెలుసుకున్నాడు. తన పడుతున్న కష్టాలను గురించి తెలుసుకున్న అజిత్ తన పిల్లల చదువు కోసం లక్ష రూపాయలను సాయంగా ఇచ్చారు. అయితే తను చేసిన సహాయాన్ని అజిత్ అందరి లాగా బయట చెప్పకపోవడం ఎంతో విశేషం.