నెర‌వేర‌నున్న‌ అభిమానుల కోరిక..!

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు

By Medi Samrat
Published on : 30 April 2025 9:32 PM IST

నెర‌వేర‌నున్న‌ అభిమానుల కోరిక..!

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కు భారీ డిమాండ్ ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు, కానీ ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. సంవత్సరాల నిరీక్షణ తర్వాత, వెంకటేష్-త్రివిక్రమ్ కాంబో లాక్ అయింది. త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచాయి. కానీ ఈ కాంబినేషన్ లో సినిమా చాలా సంవత్సరాలుగా వాయిదా పడుతూనే వస్తోంది. పరిశ్రమ వర్గాల నుండి వచ్చిన తాజా నివేదిక ప్రకారం చివరకు ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని తెలుస్తోంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ సినిమా తర్వాత, నటుడు అధికారికంగా ఏ ప్రాజెక్ట్‌ను లాక్ చేయలేదు. త్రివిక్రమ్ కూడా సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్‌ పూర్తయ్యాక ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది. ఇంతలో వెంకటేష్ తో సినిమా తీయాలని త్రివిక్రమ్ చూస్తున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Next Story