ఆ దేశాల్లోనూ మేజర్ సినిమా హవానే

Adivi Sesh’s ‘Major’ trends at top 10 across 14 countries. జూన్ 3వ తేదీన రిలీజైన మేజర్ మూవీ మంచి విజయం సాధించింది.

By Medi Samrat  Published on  16 July 2022 7:15 PM IST
ఆ దేశాల్లోనూ మేజర్ సినిమా హవానే

జూన్ 3వ తేదీన రిలీజైన మేజర్ మూవీ మంచి విజయం సాధించింది. మేజర్ సినిమా భారతదేశంలోని ముంబైలో 2008 తాజ్ ప్యాలెస్ హోటల్ దాడి సమయంలో విధి నిర్వహణలో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కెరీర్ గురించి చూపించింది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ప్రకాశ్‌ రాజ్‌, రేవతి ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు. ముంబై దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచిత పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఉన్నికృష్ణన్ పాత్రలో శేష్ నటించాడు. తెలుగు, హిందీతో పాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది.

ఈ సినిమా ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో వచ్చినప్పటి నుండి తెగ చూసేస్తూ ఉన్నారు. పాకిస్థాన్ లో కూడా ఈ సినిమా ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సినిమా ఏకంగా 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ మూవీ ర్యాంకింగ్స్ లో టాప్ 10లో నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు విదేశాల్లోనూ మంచి స్పందన వస్తుంది. బహ్రెయిన్, బంగ్లాదేశ్, కువైట్, మలేషియా, మాల్దీవులు, ఒమన్, పాకిస్తాన్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈ సహా 14 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్స్ టాప్ 10లో ఈ సినిమా నిలిచింది. ఇక ఇండియా, మారిషస్, నైజీరియాలో టాప్ 1లో ఉన్నట్లు నెట్ ఫ్లిక్స్ తెలిపింది. తెలుగు, హిందీ, భాషలతోపాటు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‏తో ఈ సినిమా అందుబాటులో ఉంది.










Next Story