ఆదిపురుష్ ఆరంభ్.. పోస్ట్ పెట్టిన ప్ర‌భాస్

Adipurush Shooting Starts From Today. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా.. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ వ్య‌యంతో రామాయ‌ణ గాథ ఇతివృత్తంగా ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతున్నఈ సినిమా.. నేటి నుండి ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది

By Medi Samrat  Published on  2 Feb 2021 9:18 AM IST
Adipurush Shooting Starts From Today.

పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా.. దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ వ్య‌యంతో రామాయ‌ణ గాథ ఇతివృత్తంగా ఆదిపురుష్ అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. నేటి నుండి ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు.


ఈ మేర‌కు ఆదిపురుష్ ఆరంభ్ అంటూ.. పోస్ట‌ర్‌ను పోస్ట్ చేశాడు. ఈ ఉద‌యం పోస్ట్ చేసిన గంట‌లోపే ల‌క్ష‌ల్లో లైక్లు, షేర్‌ల‌తో వైర‌ల్ అయ్యింది. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. సైఫ్ అలీఖాన్ విల‌న్ పాత్రైన‌టువంటి రావ‌ణుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఇక చిత్రంలో మిగిలిన పాత్ర‌ల‌పై అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 11, 2022న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Next Story