అడవి శేష్ "మేజర్" ఫస్ట్ లుక్ చూశారా?

Adavi Shesh Major Movie First Look. మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాత్రి, పగలు దేశ సరిహద్దులలో

By Medi Samrat  Published on  17 Dec 2020 6:15 PM IST
అడవి శేష్ మేజర్ ఫస్ట్ లుక్ చూశారా?

మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాత్రి, పగలు దేశ సరిహద్దులలో కాపు కాస్తూ మన దేశాన్ని రక్షిస్తూ ఎంతో మంది సైనికులు వీరమరణం పొందుతున్నారు.అలా ముంబై దాడులలో దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మేజర్". అయితే ఈ చిత్రంలో అడవి శేషు హీరోగా నటిస్తున్నారు. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మేజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

అతి చిన్న వయసులోనే ఎంతో ధైర్యసాహసాలతో ఆర్మీ లోకి వచ్చిన ఉన్నికృష్షన్‌ ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. ఆర్మీలో తాను చేసిన ధైర్యసాహసాలు ప్రతిబింబించేలా తన జీవిత కథాంశంతో మేజర్ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ ఉన్ని కృష్షన్‌ ఆర్మీ లోకి వచ్చినప్పటి నుంచి తన ప్రయాణాన్ని ఎలా సాగించిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఈ చిత్ర ముఖ్య ఉద్దేశమని దర్శకుడు శశికిరణ్ తిక్కా తెలిపారు.

27/11న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వ‌ర్ధంతి సందర్భంగా హీరో అడవి శేషు లుక్ టెస్ట్ పోస్టర్ తో పాటు అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈ సినిమా గురించి చేసే ప్రయాణాన్ని వీడియో రూపంలో వెల్లడించారు. పాన్ ఇండియా రూపంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అడవి శేషు సరసన శోభిత దూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.




Next Story