అలాంటోడు దొరకపోతే బంట‌రిగానే ఉండిపోతా : త‌్రిష‌

Actress Trisha opens up about her Marriage. వర్షం చిత్రంతో‌ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అందాల

By Medi Samrat  Published on  18 Nov 2020 8:32 AM GMT
అలాంటోడు దొరకపోతే బంట‌రిగానే ఉండిపోతా : త‌్రిష‌

వర్షం చిత్రంతో‌ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది అందాల భామ త్రిష. ద‌క్షిణాదికి చెందిన అగ్ర‌, యువ హీరోల స‌ర‌స‌న న‌టించింది. నాలుగు ప‌దుల‌కు ద‌గ్గ‌రైనా అమ్మ‌డు ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్రిష త్వ‌ర‌లో ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుంద‌ని ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త్రిష.. త‌న పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్రేమించిన వ్య‌క్తినే పెళ్లి చేసుకుంటాన‌ని.. నా ఇష్టాల‌ను అభిరుచుల‌ను గౌర‌వించేవాడై ఉండాల‌ని చెప్పుకొచ్చింది. అలాంటి వాడు దొర‌క‌క‌పోతే ఒంట‌రిగానే ఉండిపోతాన‌ని అంటోంది అందాల భామ‌. "పెళ్లి చేసుకోన‌ని నేనెప్పుడూ చెప్ప‌లేదు. త‌ప్ప‌కుండా చేసుకుంటా.. నా ఇష్టాల్నీ, నా అభిరుచుల్నీ, నా వృత్తినీ గౌర‌వించేవాడ్ని పెళ్లి చేసుకుంటా. ఒకవేళ అలాంటోడు దొరకపోతే ఒంటరిగా ఉండిపోతా. "అంటూ త్రిష చెప్పింది.

2015లో తమిళ నిర్మాతతో త్రిష పెళ్లి ఫిక్స్ అయింది. నిశ్చితార్థం కూడా గ్రాండ్ గానే చేసుకున్నారు. కానీ అమ్మడి బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లలేకపోయింది. కాగా.. త‌మిళ న‌టుడు శింబుని త్రిష పెళ్లి చేసుకోనుంద‌నే వార్త‌లు గ‌త కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. ఈ విష‌యం గురించి శింబు తండ్రి రాజేంద‌ర్‌ని అడ‌గ్గా.. ఆయ‌న దీనిపై స్పందించ‌లేదు. దీంతో వీరిద్ద‌రి పెళ్లి ఖాయం అనే బావిస్తున్నారు.


Next Story
Share it