కాంగ్రెస్‌లో చేర‌నున్న త్రిష‌..?

Actress Trisha likely to join Congress. ద‌క్ష‌ణాది భామ‌ త్రిష రాజకీయ ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

By Medi Samrat  Published on  19 Aug 2022 3:54 PM IST
కాంగ్రెస్‌లో చేర‌నున్న త్రిష‌..?

ద‌క్ష‌ణాది భామ‌ త్రిష రాజకీయ ఆరంగేట్రం చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. తమిళ నటుడు తలపతి విజయ్.. త్రిషను రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల‌ని.. ప్రజలకు సేవ చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ఈ మేర‌కు త్రిష కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. విజయ్‌, త్రిషల‌ మధ్య మంచి ప్రెండ్‌షిఫ్‌ ఉంది. వీరివురు ఇప్పటికే నాలుగుచిత్రాల్లో కలిసి నటించారు. తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.

అయితే.. త్రిష పొలిటిక‌ల్ ఎంట్రీ ప్రచారంలో నిజం ఎంత? అనేది తెలియాల్సివుంది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ పొన్నియిన్ సెల్వన్ లో త్రిష‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది సెప్టెంబరు 30న థియేటర్లలో విడుదల కానుంది.

చెన్నైకు చెందిన త్రిష‌.. కృష్ణన్, ఉమా దంపతులకు 1983లో జన్మించింది. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై.. తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. అనంత‌రం త్రిష 2002లో విడుదలైన తమిళ చిత్రం 'మౌనం పేసియాదే'తో కథానాయికగా తెరంగేట్రం చేసింది. త్రిష మొదటి తెలుగు చిత్రం వర్షం. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. త్రిష తెలుగులో నమో వెంకటేశ, నాయకి, నీ మనసు నాకు తెలుసు, అతడు,సైనికుడు, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే, స్టాలిన్, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, కృష్ణ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో న‌టించింది.


Next Story