పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి అనిత
Actress Anita Hassanadani blessed with a baby boy. ఒకప్పటి తెలుగు తారా అనిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
By Medi Samrat Published on 10 Feb 2021 5:28 PM ISTఒకప్పటి తెలుగు తారా అనిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఈ విషయాన్ని అనిత భర్త రోహిత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. తన భార్యతో సంతోషాన్ని షేర్ చేసుకుంటున్న ఫోటోలను కూడా తన ఇన్స్టా స్టోరీస్ లో పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిత అభిమానులంతా ఆమెకు అభినందనలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక అనిత పలు తెలుగు సినిమాలలో నటించి తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సీరియల్ లో నటించింది. 2013లో బిజినెస్‌మేన్ రోహిత్‌రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అనిత గురించి చెప్పాలంటే..'నువ్వు నేను' తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది అనిత.
ఈమె పూర్తి పేరు అనితా హస్సానందిని అయినప్పటికీ అనితగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.'నువ్వు నేను' చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో… అనితకు ఆ వెంటనే 'శ్రీరామ్' 'నిన్నే ఇష్టపడ్డాను' 'ఆడంతే అదో టైపు' 'నేను పెళ్ళికి రెడీ' వంటి క్రేజీ చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి.ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోగా… కొన్నాళ్ల తరువాత అనిత కాస్త ఒళ్ళు చెయ్యడంతో అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు.
అటు తర్వాత స్లిమ్ అయ్యి 'నేనున్నాను' 'జీనియస్' వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ రీ ఎంట్రీ ఇచ్చింది. అవి కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.దాంతో హిందీలో సీరియల్స్ చేస్తూ బిజీగా గడుపుతుంది.ఇప్పుడు తన వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది అనిత..