నటుడు విష్ణు విశాల్ తమిళ చిత్రం ఎఫ్‌ఐఆర్‌కి తెలంగాణలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఎఐఎంఐఎం ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా క్వాద్రీ, జాఫర్ హుస్సేన్ మెరాజ్, కౌసర్ మొహియుద్దీన్‌లు శుక్రవారం సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి 'ఎఫ్‌ఐఆర్' చిత్రానికి వ్యతిరేకంగా ఫిర్యాదు సమర్పించారు. ఈ సినిమా పోస్టర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో 'షహదా' అని రాసి ఉండటంతో సినిమాపై వ్యతిరేకత ఎదురవుతోంది.
విష్ణు విశాల్ తాజా తమిళ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎఫ్‌ఐఆర్‌ను మూడు దేశాల్లో విడుదల చేయకుండా నిషేధం విధించారు. నివేదిక ప్రకారం, సినిమా ఎఫ్‌ఐఆర్ స్థానిక సెన్సార్ బోర్డుల నుండి ఆమోదం పొందడంలో విఫలమైంది. ఈ చిత్రం ప్రస్తుతం మలేషియా, కువైట్, ఖతార్‌లలో నిషేధించబడింది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, రెబా మోనికా జాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు.