విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చిన కావేరీ ఆసుపత్రి వైద్యులు

Actor Vikram hospitalised after suffering heart attack, condition stable now. చెన్నైలో హీరో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది.

By Medi Samrat  Published on  8 July 2022 7:24 PM IST
విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చిన కావేరీ ఆసుపత్రి వైద్యులు

చెన్నైలో హీరో విక్రమ్ కు చికిత్స అందిస్తున్న కావేరీ ఆసుపత్రి స్పందించింది. విక్రమ్ ఆరోగ్యంపై తాజాగా బులెటిన్ విడుదల చేసింది. విక్రమ్ కు కార్డియాక్ అరెస్ట్ లక్షణాలేవీ లేవని, అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో విక్రమ్ తమ ఆసుపత్రిలో చేరినట్టు వెల్లడించింది. విక్రమ్ ను నిపుణులైన తమ ఆసుపత్రి వైద్యుల బృందం పరీక్షించిందని, అవసరమైన వైద్యం అందించిందని తెలిపింది. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని కావేరీ ఆసుపత్రి తన ప్రకటనలో తెలిపింది.

విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. విక్రమ్ కు ఛాతీలో స్వల్పంగా అసౌకర్యం ఏర్పడిందని, దాంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణనన్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని అన్నారు. విక్రమ్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేనేజర్ తెలిపారు.










Next Story