మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ తర్వాత.. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)తో బాధపడుతున్నట్లు బయట పెట్టారు. మనోరమ ఆన్‌లైన్‌తో మాట్లాడుతూ.. "నాకు ADHD ఉంది. ఇది ఉన్న వ్యక్తులు తరచుగా ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు." అని తెలిపారు.
ADHD ఉన్న ఎవరైనా.. తమను చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు గుర్తించాలని కోరుకుంటారని.. ఇతర నటుల నుండి ప్రత్యేకంగా నిలబడటానికి ప్రయత్నిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టి తమపై ఉండేలా కోరుతూ.. పాత్రకు అనుగుణంగా ప్రదర్శన చేస్తారని తెలిపారు. బయటి వ్యక్తులు దీనిని ఒక రుగ్మతగా భావిస్తారని.. తనకు మాత్రం ADHD ఒక క్వాలిటీ లాంటిదని తెలిపారు. ఇది అందరికీ వర్తించకపోవచ్చని.. కానీ నాకు ADHD చాలా ప్రయోజనకరంగా ఉందని బయటపెట్టారు. దసరా, రంగబలి సినిమాలలో నటించి తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు షైన్ టామ్ చాకో.