ఎట్ట‌కేల‌కు హీరోయిన్ సంజ‌న‌కు బెయిల్‌.. !

Actor Sanjjanaa Galrani gets bail after 3 months. శాండిల్ వుడ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన న‌టి సంజ‌న‌కు బెయిల్ మంజూరైంది.

By Medi Samrat  Published on  11 Dec 2020 11:52 AM GMT
ఎట్ట‌కేల‌కు హీరోయిన్ సంజ‌న‌కు బెయిల్‌.. !

శాండిల్ వుడ్ డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన న‌టి సంజ‌న‌కు బెయిల్ మంజూరైంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా.. క‌ర్ణాట‌క హైకోర్టు శుక్ర‌వారం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్ప‌టికే ప‌లుమార్లు సంజ‌న బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని న్యాయ‌స్థానం కొట్టివేస్తూ వ‌చ్చింది. అయితే.. ఈ సారి సంజ‌న త‌న ఆరోగ్య రీత్యా బెయిల్ మంజూరు చేయాల‌ని కోర‌డంతో.. అందుకు న్యాయ‌స్థానం అంగీక‌రించింది. అయితే.. కొన్ని ష‌ర‌తులు విధించింది. ఈ బెయిల్‌కు సంబంధించిన ఆర్డ‌ర్‌ను వెంట‌నే జైలు అధికారుల‌కు అందేలా చూడాల‌ని కోర్టు ఆదేశించింది.

సంజ‌న‌కు కోర్టు విధించిన ష‌ర‌తులు ఇవే. రూ.3,00,000 లక్షల పూచికత్తు సమర్పించాలి. ఇద్దరు ష్యూరిటీ ఉండాలి. ప్రతి నెలా రెండు సార్లు పోలీసు స్టేషన్‌లో అటెండెన్స్ వేయించుకోవాలి. సాక్షాలు తారుమారు చేయకూడదు. విచారణకు అడ్డుపడకూడదు. పూర్తిగా సహకరించాలి. కాగా ఇదే కేసులో అరెస్టైన రాగిణికి కోర్టు బెయిల్ మంజూరు చేయ‌లేదు.


Next Story